: పలు రైళ్లు రద్దు... కృష్ణా ఎక్స్ ప్రెస్ విజయవాడ వరకే పరిమితం: రైల్వే అధికారులు


తమిళనాడుతో బాటు, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వాటి వివరాలు... చెన్నై-ఎగ్మోర్ గౌహతి ఎక్స్ ప్రెస్, చెన్నై సెంట్రల్- తిరుపతి ఎక్స్ ప్రెస్, తిరుపతి- చెన్నై సెంట్రల్ సప్తగిరి ఎక్స్ ప్రెస్, చెన్నై-గూడూరు, రేణిగుంట- గూడూరుల మధ్య నడిచే అన్ని ప్యాసింజర్ రైళ్లతో పాటు రేపు బయలుదేరాల్సిన తిరుపతి-మన్నార్ గుడి ఎక్స్ ప్రెస్ కూడా రద్దయింది. కాగా, ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్ ప్రెస్ ను విజయవాడ వరకే నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News