: ‘బాహుబలి’ కోసం పోటీపడుతున్న ‘యూరప్’ డిస్ట్రిబ్యూటర్లు !


‘బాహుబలి’ ప్రదర్శన హక్కులను దక్కించుకునేందుకు యూరప్ ఖండంలోని దేశాల డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతున్నారు. ఈ చిత్రం హక్కుల కోసం బడా డిస్ట్రిబ్యూటర్లు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా యూరోపియన్ డిస్ట్రిబ్యూటర్ పెర్రీ అసోలియన్ మాట్లాడుతూ, భారతీయ సినిమా హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతుండటం ఇక్కడి సినీ పరిశ్రమకు శుభ పరిణామమన్నారు. కాగా, చైనా, లాటిన్ అమెరికాల్లో బాహుబలి చిత్రం హక్కులు ఇప్పటికే అమ్ముడుపోయాయి. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పార్ట్-2 కూడా త్వరలో తెరకెక్కనుంది. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News