: ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న 'ఐ బాల్' పచ్చబొట్టు!


కనుగుడ్డుకు పచ్చబొట్టు (టాటూ) పొడిపించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఫ్యాషన్... ఇప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని ఫ్యాషన్ ప్రియులు ఈ కొత్త పోకడకు విపరీతంగా ఆకర్షితులయ్యారు. 'ఐ బాల్' టాటూగా ప్రసిద్ధి చెందిన ఈ కొత్త ఫ్యాషన్ కు ఆద్యుడు అమెరికన్ బాడీ మాడిఫికేషన్ ప్రతిపాదకుడు లూనా కోబ్రా. ఈ ఫ్యాషన్ ను ఇష్టపడే వారు తమ తెల్లగుడ్డుకు రంగు రంగుల టాటూలు వేయించుకుంటున్నారు. అందరి కంటే భిన్నంగా ఉండాలనే తపనతో ఇటువంటి పనులు చేయడం కంటికే ప్రమాదమంటున్నారు వైద్యులు. ఐ బాల్ టాటూయింగ్ కారణంగా అంధత్వం, కేన్సర్ వచ్చే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు. అయితే లూనా కోబ్రా మాత్రం అదేమీకాదంటున్నాడు. అయితే, ఎవరికి వారు సొంతంగా ఐ బాల్ టాటూయింగ్ చేసుకుంటే ప్రమాదముంటుందని మాత్రమె వైద్యులు చెబుతున్నారని లూనా కోబ్రా అంటున్నాడు.

  • Loading...

More Telugu News