: దమ్ముంటే రాజీనామా చేసి నాపై గెలువు: కొడాలి నానికి బొండా ఉమ సవాల్
గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి నానికి లేదని... దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి... తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. గుడివాడలో కొడాలి నాని బాధితులు ఎవరున్నా ధైర్యంగా ముందుకు రావాలని... అలాంటి వారికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇకపై నాని అరాచకాలు సాగవని హెచ్చరించారు. నాని వల్ల నష్టపోయిన వాళ్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.