: హెచ్ఆర్సీని ఆశ్రయించిన జెరూసలేం మత్తయ్య
ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య ప్రాణ రక్షణ కోరుతూ మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. ఇటీవల కొందరు వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో తనకు ఇరు రాష్ట్రాలు భద్రత కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. మరోవైపు ఓటుకు నోటు కేసులో మత్తయ్య వేసిన పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ నెల 20వ తేదీలోపు మత్తయ్య అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే కోర్టులో ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జిషీటును తమకు సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 2కు వాయిదా వేసింది.