: అవార్డులు వెనక్కి ఇస్తున్న వారిపై రాష్ట్రపతి సీరియస్
దేశంలో అసహనం పెరిగిపోయిందని ఆరోపిస్తూ పలువురు రచయితలు, కళాకారులు, మేధావులు తమ అవార్డులను వెనక్కి ఇస్తుండటం తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చేయడం సరికాదని అన్నారు. భావాలను అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. అవార్డులను వెనక్కి ఇచ్చేయడంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు పలు విధాలుగా స్పందించారు. ఈ నేపథ్యంలో, అవార్డులను వెనక్కి ఇవ్వడం సరికాదంటూ సాక్షాత్తు రాష్ట్రపతే చెప్పడం... అవార్డులను వెనక్కిస్తున్న వారిలో మార్పు తీసుకొస్తుందేమో చూద్దాం.