: రెండు రోజుల తరువాత... మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు


దేశీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అంతకుముందు రెండు రోజులపాటు ధరలు తగ్గాయి. ఇవాళ రూ.235 పెరగడంతో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర రూ. 26,150కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, దేశీయంగా నగల వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టడం వంటి కారణాలతో బంగారం ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇక వెండి ధర రూ.300 పెరగడంతో కేజీ వెండి రూ.34,600కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు జరపడంతో డిమాండ్ పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News