: ముస్లిం ఇమామ్ లను బహిష్కరించనున్న ఫ్రాన్స్


ప్యారిస్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాడికల్ ముస్లిం ఇమాంలను, ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని దేశం నుంచి బహిష్కరించే యోచనలో ఉన్నట్టు ఫ్రాన్స్ ఆంతరంగిక మంత్రి వెల్లడించారు. ఉగ్ర సంబంధాలు కలిగి ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోను క్షమించమని తెలిపారు. ఉగ్రవాదులకు దేశంలోని కొందరు ముస్లింలు సహకరిస్తున్నారని తేలడంతో ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోపైపు, 168 చోట్ల దాడులు చేసిన ఫ్రాన్స్ పోలీసులు 104 మందిని గృహ నిర్బంధంలో ఉంచారు. యూరోపియన్ దేశాల్లో ఫ్రాన్స్ లోనే అధికంగా ముస్లిం జనాభా ఉంది.

  • Loading...

More Telugu News