: భారత్ లో అయితే పాక్ ఆడే ప్రసక్తే లేదు: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు


భారత జట్టుతో డిసెంబర్ లో జరగాల్సిన ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ను భారత్ లో పాక్ ఆడదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్యార్ ఖాన్ ప్రకటించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆ సిరీస్ ను యూఏఈలో మాత్రమే ఆడతామని స్పష్టం చేశారు. ఈ మేరకు భారత్ లో ఆడాలంటూ బీసీసీఐ చేసిన విన్నపాన్ని షహర్యార్ ఖాన్ తిరస్కరించారు. భారత్ తమతో ఆడాలనుకుంటే మాత్రం అది యూఏఈ లోనేనని, భారత్-పాక్ సిరీస్ అక్కడే జరుగుతుందని తెలిపారు. ఇందులో మరో మాటే లేదని విస్పష్టం చేశారు. అయితే బీసీసీఐ మాత్రం భారత్ లో సిరిస్ నిర్వహిస్తేనే ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని, మరో దేశంలో అయితే ఆడమని పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News