: డోంట్ వర్రీ... క్షేమంగానే ఉన్నా: అమీర్ ఖాన్


తనకు ఏమీ కాలేదని, క్షేమంగానే ఉన్నానని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తెలిపాడు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ షూటింగులో పాల్గొంటానని ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపాడు. తాను నటిస్తున్న 'దంగల్' సినిమా షూటింగ్ సందర్భంగా, ఓ రెజ్లింగ్ సీన్ ను చిత్రీకరిస్తుండగా అమీర్ భుజం కండరాలు పట్టేశాయి. మల్లయోధుడు మహవీర్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పంజాబ్ లోని లూథియానాలో షూటింగ్ జరుగుతుండగా ఇది చోటు చేసుకుంది. అమీర్ ను పరీక్షించిన వైద్యులు వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News