: ఆదిలాబాద్ జిల్లా ఇక్బాల్ పూర్ లో పెద్దపులి సంచారం!... భయాందోళనల్లో స్థానికులు!
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అటవీ ప్రాంతం ఇక్బాల్ పూర్ లో పెద్దపులి సంచరిస్తోంది. దీంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. నిన్న రాత్రి నిర్మల్ వైపు నుంచి ఒక కుటుంబం కారులో వస్తున్న సమయంలో పెద్దపులి తిరుగుతుండటాన్ని వారు గమనించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో డీఎఫ్ఓ ప్రభాకర్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు సోమవారం ఇక్బాల్ పూర్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ పెద్దపులి అడుగుజాడలు ఉండటాన్ని గుర్తించారు. స్థానికులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పెద్దపులి సంచారాన్ని గమనించే నిమిత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు డీఎఫ్ వో తెలిపారు.