: హైదరాబాద్ రా... తేల్చుకుందాం!: బాబుకు కొడాలి నాని సవాల్


వైకాపా నేతలపై రాజకీయ కుట్రలో భాగంగా చంద్రబాబు సర్కారు కేసులు పెట్టి జైళ్లకు పంపుతోందని, ఈ విషయంలో చంద్రబాబు తన తప్పు లేదని భావిస్తే చర్చకు రావాలని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ విసిరారు. హైదరాబాద్ లో చర్చకు సిద్ధం కావాలని, అక్కడి పోలీసులు తెలంగాణ వారు కాబట్టి ఎటు వైపూ మొగ్గు చూపక నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని అన్నారు. ధైర్యముంటే హైదరాబాద్ లో చర్చకు సిద్ధమై వస్తే, తేల్చుకుందామని అన్నారు. అధికారుల వేధింపులకు నిరసనగా ధర్నా చేపట్టిన తమ పార్టీ నేత పేర్ని నానిపై మూడు కేసులు బనాయించారని, తన పార్టీ కార్యాలయం ఖాళీ చేయించే పేరిట పోలీసులను ఉసిగొల్పారని కొడాలి నాని ఆరోపించారు. విపక్షాలపై చంద్రబాబు సర్కారు వైఖరికి వ్యతిరేకంగా పోరు తీవ్రతను మరింతగా పెంచుతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News