: సయీద్ జాఫ్రీ మృతిపట్ల మోదీ సంతాపం
బాలీవుడ్ సీనియర్ నటుడు సయీద్ జాఫ్రీ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన ఆయన ప్రేక్షకుల గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని తన సందేశంలో పేర్కొన్నట్టు ప్రధాని కార్యాలయం ట్విట్టర్ లో పోస్టు చేసింది. 86 సంవత్సరాల జాఫ్రీ వృద్ధాప్య సమస్యలతో నిన్న (ఆదివారం) కన్నుమూశారు. ఆయన తన సహనటి మెహ్రూనిమా (మాధుర్ జాఫ్రీ)ని పెళ్లి చేసుకున్నారు. అనంతరం 1965లో వారు విడిపోయారు. వీరికి ముగ్గురు కుమార్తెలు మీరా, జియా, సకినా ఉన్నారు. మరోవైపు రిషి కపూర్, శేఖర్ కపూర్, మధుర్ భండార్కర్, దలేర్ మెహందీ తదితరులు ట్విట్టర్ లో జాఫ్రీకి సంతాపం తెలిపారు.