: కన్నీరు పెట్టిన పాప్ స్టార్ మడోన్నా
ఐదు పదుల వయసు దాటినా, వన్నె తగ్గని అందం, చలాకీతనంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే పాప్ గాయని మడోనా కన్నీరు పెట్టింది. స్వీడన్ లోని స్టాక్ హోం లో ఓ సంగీత ప్రదర్శన ఇచ్చిన ఆమె, పారిస్ దాడులను ప్రస్తావిస్తూ, పెల్లుబుకుతున్న కన్నీటిని ఆపుకోలేక, బోరున విలపించింది. ఓ వైపు ప్రజలు తమవారిని కోల్పోయి విలపిస్తుంటే, తాను ఎందుకు నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతున్నానన్న విషయాన్ని వివరిస్తూ, దాడులు జరుపుతున్న ఉగ్రవాదులు, మన నోరు మూయించాలని చూస్తున్నారని, అది ఎన్నటికీ జరగదని స్పష్టం చేసేందుకే తాను పాడుతున్నానని వెల్లడించింది. పాప్యులర్ విషాద గీతమైన 'లైక్ ఏ ప్రేయర్'ను పాడుతూ పారిస్ మృతులకు శ్రద్ధాంజలి ఘటించింది.