: గంటల వ్యవధిలో 24 శాతం లాభాలిచ్చిన 'ఎస్.హెచ్ కేల్కర్'
ఐపీఓకు వచ్చి విజయవంతంగా నిధులను సమీకరించిన 'ఎస్.హెచ్ కేల్కర్', ఆపై స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన తొలి రోజున సత్తా చాటింది. సంస్థ ఈక్విటీ ఇష్యూ ధర రూ. 180 కాగా, మార్కెట్ ప్రారంభమైన కాసేపటికే ధర రూ. 223ను దాటింది. ఇష్యూ ప్రైస్ పై ఇది 24 శాతం అధికం. ఓ దశలో రూ. 200 కనిష్ఠస్థాయిని, రూ. 225 గరిష్ఠ స్థాయిని ఈక్విటీ తాకింది. ఐపీఓ ద్వారా ఎస్.హెచ్ కేల్కర్ మొత్తం రూ. 508 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. కంపెనీ ఇష్యూ మార్కెట్ ను తాకినప్పుడు ఇన్వెస్టర్ల నుంచి అపరిమిత స్పందన రాగా, అమ్మకానికి ఉంచిన బిడ్లతో పోలిస్తే 19.74 రెట్లు అధిక బిడ్లు దాఖలయ్యాయి. ఈ సంస్థ భవిష్యత్తులో ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందిస్తుందని అంచనా.