: 'అమ్మ' వరదల్లో చెన్నై మునిగిపోయింది: సుబ్రమణ్యస్వామి


తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. ఇక రాజధాని చెన్నైలో అయితే రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఈ మొత్తం పరిస్థితికి బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి తమిళనాడు ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం కారణంగానే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. 'అమ్మ' వరదల్లో చెన్నై మునిగిపోయిందని, 'అమ్మ' డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్లే ఈ దుస్థితి సంభవించిందని ట్విట్టర్ లో సీఎం జయలలితపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News