: తెలంగాణ ఉద్యమాన్ని చూసైనా పవన్ కల్యాణ్ నేర్చుకోవాలి: కారెం శివాజీ


పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడు కాదని... సినిమా యాక్టర్ అని మాల మహానాడు అధినేత కారెం శివాజీ అన్నారు. ఎంతో ప్రజాకర్షణ ఉన్న పవన్ కల్యాణ్ రోడ్డెక్కితే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని చూసైనా పవన్ కొన్ని విషయాలను నేర్చుకోవాలని సూచించారు. మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదాను సాధించేందుకు త్వరలోనే మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేపడతామని అన్నారు. డిసెంబర్ 7వ తేదీన పార్లమెంటును ముట్టడిస్తామని చెప్పారు. బీహార్, కాశ్మీర్ లకు ప్యాకేజీలు ఇచ్చి, ఏపీకి మాత్రం మొండి చేయి చూపారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను రక్షించుకోవడానికి త్వరలోనే జాతీయ సదస్సును నిర్వహించబోతున్నామని కారెం శివాజీ చెప్పారు. దళితుల భూములను పలువురు ఆక్రమించుకుంటున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఒక్క వ్యక్తికి కూడా ఇంత వరకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News