: కేసీఆర్ కు నేను, కేటీఆర్ ఇద్దరూ ఇష్టమే... సీఎం కావాలన్న కోరిక లేదు: హరీష్ రావు


మంత్రి కేటీఆర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని టీఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తాను, కేటీఆర్ కలసి ఉండటం చూసి ఓర్వలేని వ్యక్తులే ఇలాంటి వార్తలను తెరపైకి తెస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాను, కేటీఆర్ ఇద్దరూ ఇష్టమేనని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణను సాధించడమే తన లక్ష్యమని... ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తనకు లేదని స్పష్టం చేశారు. తాను, కేటీఆర్, కవిత బ్యాక్ డోర్ ఎంట్రీలో రాజకీయాల్లోకి రాలేదని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, ప్రజల ఆశీస్సులతోనే భారీ మెజార్టీతో గెలిచి, పదవులను చేపట్టామని చెప్పారు. శృతి ఎన్ కౌంటర్ బాధాకరమని హరీష్ అన్నారు. తెలంగాణలో యువకుల మరణాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని... 2004లోనే తెలంగాణను ఇచ్చి ఉంటే ఇంత మంది విద్యార్థులు, యువకులు చనిపోయేవారు కాదని హరీష్ మండిపడ్డారు. కేసీఆర్ ది ఒక త్యాగాల చరిత్ర అని కొనియాడారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ నేతలు ఏమి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News