: ఇమ్రాన్ ఖాన్ లో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి... అందుకే విడాకులు: రేహమ్ ఖాన్


పాక్ మాజీ క్రికెటర్, రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్, టీవీ జర్నలిస్ట్ రేహమ్ ఖాన్ (42) ల ప్రేమ పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. పెళ్లి పెటాకులై, విడాకులు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో, ఇంత వరకు మౌనంగా ఉన్న రేహమ్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాను బయట కనపడరాదంటూ ఆర్డర్ వేసేవాడని, వంటింట్లో చపాతీలు చేయాలని చెప్పేవాడని రేహమ్ మండిపడింది. ఎంతసేపు తనను వంటింటి కుందేలును చేయాలనే చూశాడని ఆరోపించింది. ఓ వైపు తాను గలగలా మాట్లాడుతుంటే, ఇమ్రాన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా సైలెంట్ గా ఉండేవాడని రేహమ్ ఖాన్ విమర్శించింది. కనీసం ఇంటిలోని కర్టెన్ల రంగు గురించి కూడా ఆయనతో మాట్లాడరాదని... కేవలం రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడాలని చెప్పింది. బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడటం కూడా ఆయనకు ఇష్టం ఉండదని తెలిపింది. రోజుకు కేవలం ఒక్క చపాతీ మాత్రమే తినేవాడని చెప్పింది. ఇమ్రాన్ ను మార్చాలని ఎంతో ప్రయత్నించానని, అయినా కాలేదని తెలిపింది. తాను అబద్ధం చెప్పదలుచుకోలేదని... తాను గృహ హింసకు గురయ్యానని స్పష్టం చేసింది. మరోవైపు, ఈ విషయంపై ఇమ్రాన్ ఖాన్ ను మీడియా ప్రశ్నించగా... ఆయన స్పందించలేదు. 'నా గతం గురించి ఇమ్రాన్ కు తెలిసినప్పటికీ... ఎప్పుడూ దాని గురించే ఆలోచించేవాడ'ని విమర్శించింది. బీబీసీలో జర్నలిస్టుగా పనిచేసిన రేహమ్ కు గతంలోనే పెళ్లయి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News