: బాలీవుడ్ సీనియర్ నటుడు సయీద్ జాఫ్రీ కన్నుమూత
బాలీవుడ్ సీనియర్ నటుడు సయీద్ జాఫ్రీ (86) కన్నుమూశారు. 1968లో సినీరంగంలో ప్రవేశించిన ఆయన, పంజాబ్ లోని మాలెర్ కోట్లాలో జన్మించారు. పలు హిందీ, ఆంగ్ల నాటకాల్లో రాణించి తరువాత కొన్ని వందల హిందీ, ఆంగ్ల సినిమాల్లో నటించారు. జాఫ్రీ నటించిన తొలిచిత్రం 'స్టాక్ డ్'. దర్శకుడు రిచర్డ్ అటెన్ బరో తీసిన 'గాంధీ' సినిమాలో సర్దార్ పటేల్ గా నటించారు. 1978లో ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. షత్రంజే కే కిలాడి, రామ్ తేరి గంగా మైలి, చష్మే బద్దూర్, మసూమ్ లాంటి హిందీ సినిమాల్లో నటించారు. నాటకరంగానికి ఆయన చేసిన సేవలకుగాను 'ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్' పురస్కారం లభించింది. జాఫ్రీ మృతిపట్ల బాలీవుడ్ నటులు, రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.