: కొడాలి నాని ఓ సైకో, ఓ పిచ్చోడు, ఓ ఐరన్ లెగ్: టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గడ్డం, మీసాలు పెంచుకున్నంత మాత్రాన తాను పెద్ద రౌడీ అనే రీతిలో నాని వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. నాని ఒక సైకో, ఒక పిచ్చోడు, ఓ ఐరన్ లెగ్ అంటూ ధ్వజమెత్తారు. గతంలో రెండు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా నాని గెలిచారని, ఆ రెండు సార్లు టీడీపీ అధికారంలోకి రాలేదని... ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యేగా నాని గెలుపొందారని, ఐరన్ లెగ్ మహిమ వల్ల ఆ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుందని ఎద్దేవా చేశారు. నాని ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాదని బుద్ధా వెంకన్న అన్నారు. ఎన్నడూ ఇంటి నుంచి బయటకు రాని ఓ వృద్ధురాలిని నాని రోడ్డు మీదకు రప్పించారని మండిపడ్డారు. నాని అరాచకాలకు ముగింపు పలుకుతామని చెప్పారు.