: ఇండియాలో మరో ఉగ్రవాద సంస్థ: కేంద్రం ప్రకటన
నాగాలాండ్ కేంద్రంగా 'ఖాప్ లాంగ్' ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని కోరుతున్న నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఖాప్ లాంగ్) - ఎన్ఎస్సీఎన్కేను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్టు ఈ ఉదయం కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు 1988 నుంచి ఇండియా, మయన్మార్ సరిహద్దుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ సంస్థను ఉగ్రవాద సంస్థల్లో చేరుస్తున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ సంస్థ అమాయకులను, భద్రతా దళాలను లక్ష్యం చేసుకుని ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించింది. కాగా, ఈ సంవత్సరం జూన్ 4న మణిపూర్ పరిధిలోని చండేల్ జిల్లాలో ఆర్మీ కాన్వాయ్ పై ఎన్ఎస్సీఎన్కే దాడి జరిపిన సంగతి తెలిసిందే.