: ఎస్... మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం: యువరాజ్ సింగ్


బ్రిటీష్ మోడల్, బాలీవుడ్ నటి హ్యాజెల్ కీచ్ తో తన ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం నిజమేనని క్రికెటర్ యువరాజ్ సింగ్ ధ్రువీకరించాడు. "అవును, మా ఎంగేజ్ మెంట్ జరిగింది. హ్యాజెల్ కీచ్ రూపంలో ఓ జీవితకాలపు స్నేహితురాలిని పొందాను. తాను అచ్చం తనలాగానే ఉందని మా అమ్మ కూడా చెప్పింది" అంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు, యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ కూడా వీరి పెళ్లి విషయాన్ని నిర్ధారించారు. మరోవైపు హ్యాజెల్ ట్వీట్ చేస్తూ ... తాను, యువరాజ్ పెళ్లి చేసుకుంటుండటం నిజమే అని, యువరాజ్ లాంటి అద్భుతమైన వ్యక్తి తనకు దొరకడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. వీరిద్దరి వివాహం ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News