: రేస్ క్లబ్బులో స్టింగ్ ఆపరేషన్ చేయించిన మంత్రి తలసాని


రాజకీయవేత్తల అవినీతిని బయటపెట్టేందుకు సాధారణంగా స్టింగ్ ఆపరేషన్లు జరుగుతుంటాయి. అయితే, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా తానే ఓ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్ మలక్ పేటలో ఉన్న రేస్ క్లబ్ కు డబ్బిచ్చి కొందరు అధికారులను తలసాని పంపించారు. ఆ డబ్బుతో వారు రేస్ క్లబ్ లో పందెం ఆడారు. పందెం ఆడిన అధికారుల్లో కొంత మంది గెలిచారు కూడా. ఇక్కడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పందెం గెలిచిన వారు, డబ్బును తీసుకుని హాయిగా వెళ్లిపోతున్నారు. గెలిచిన డబ్బుకు పన్నులు కట్టడం లేదు. వాస్తవానికి 14.5 శాతం పన్నును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. కానీ, 95 శాతం మంది పన్నులు చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. స్టింగ్ ఆపరేషన్ ద్వారా రేస్ క్లబ్ లో జరుగుతున్న భాగోతాన్ని గుర్తించిన తలసాని... పన్నుల విధానాన్ని కట్టుదిట్టం చేసేందుకు కొత్త చట్టం తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారట.

  • Loading...

More Telugu News