: పేలుళ్ల కుట్రదారుడిని కనుగొన్న ఫ్రాన్స్!


ఫ్రాన్స్ దేశాన్ని గడగడలాడించే విధంగా ఉగ్రదాడి జరగడం వెనకున్న ప్రధాన సూత్రధారుడి గురించిన సమాచారం ఆ దేశ భద్రతా దళాలకు తెలిసింది. దీంతో బ్రసెల్స్ లో పుట్టిన అబ్దెస్లాం సలా అనే 26 ఏళ్ల వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తని చెబుతూ, ఎవరూ అతన్ని పలకరించరాదని, కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. దాడుల తరువాత ఇప్పటివరకూ ఏడుగురిని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేయగా, వారిలో ఒకరు సలా సోదరుడని తెలుస్తోంది. ఫ్రాన్స్ పై దాడి కుట్ర యావత్తూ బెల్జియంలోనే జరిగిందని ఫ్రాన్స్ హోం మంత్రి తెలిపారు. కాగా, ఉగ్రవాదుల మూలాలను కనుగొనడానికి యూరప్ దేశాల్లో విస్తృత సోదాలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News