: బాక్సైట్ అనుమతులపై ఏం చేద్దాం?... నేడే ఏపీ కేబినెట్ కీలక భేటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఆ రాష్ట్ర మంత్రివర్గం నేడు కీలక భేటీ నిర్వహించనుంది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం వేదికగా జరగనున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ఇటీవల ఇచ్చిన అనుమతులపై కీలక చర్చ జరగనుంది. బాక్సైట్ తవ్వకాలపై విశాఖలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదే అదనుగా మావోయిస్టులు కూడా బలం పుంజుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో పెద్ద చర్చకే తెర తీసిన ఇసుక విధానంపై కూడా చంద్రబాబు సర్కారు సమగ్ర పాలసీని ప్రకటించనుంది. కరవు మండలాల ప్రకటన, నిత్యావసరాల ధరలపై కూడా కీలక చర్చ జరిగే అవకాశాలున్నాయి.