: నానీ.. అవాకులు చెవాకులు పేలితే నీ బతుకు బయటపెడతా: ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
చంద్రబాబుపై అవాకులు చెవాకులు పేలితే నాని బతుకు బయటపెడతానని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హెచ్చరించారు. నాని ఆక్రమించుకుని నడిపిన వైఎస్సార్సీపీ కార్యాలయం భవనం ఎదుటే రేపు ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ పెడతానన్నారు. నాని భాగోతం అంతా ప్రజలకు చెబుతానన్నారు. ‘నానీ, దమ్ముంటే అక్కడికి రా, తేల్చుకుందాం’ అంటూ వెంకన్న సవాల్ విసిరారు. నానిపై పోటీ చేసి గెలిచేందుకు చంద్రబాబు అవసరం లేదని తమ పార్టీ కార్యకర్త చాలని ఆయన అన్నారు.