: ‘సానియా’కు సినీ ప్రముఖుల బర్త్ డే గ్రీటింగ్స్
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత సానియా మీర్జాకు పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే గ్రీటింగ్స్ తెలియజేశారు. ఆదివారం పుట్టిన రోజు జరుపుకుంటున్న సానియాకు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో నటి శ్రియ, జెనీలియా, రితేశ్ దేశ్ ముఖ్, దర్శకురాలు ఫరా ఖాన్, టాలీవుడ్ నటుడు సుశాంత్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారితో దిగిన కొన్ని ఫొటోలను సానియా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఫరాఖాన్ కు సానియా ఒక ప్రత్యేక గిఫ్ట్ ను పంపింది. ఫరాఖాన్ ఆ గిఫ్ట్ ఫొటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.