: గంగిరెడ్డి ఆస్తులను జప్తు చేస్తాం: డీజీపీ రాముడు


ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని భారత్ కు తరలించే విషయంలో మారిషస్ అధికారులు తమకు పూర్తిగా సహకరించారని ఏపీ డీజేపీ జేవీ రాముడు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గంగిరెడ్డి అరెస్టు వివరాలను వివరించారు. ఆయన ఆస్తుల జాబితాను తయారు చేశామని, వాటిని చట్టప్రకారం జప్తు చేస్తామని డీజీపీ వెల్లడించారు. 2014లో ఎన్నికల సమయంలో ఒక చిన్న కేసుకు సంబంధించి గంగిరెడ్డి పేరు బయటకు వచ్చిందన్నారు. నాడు హైకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకున్నాడన్నారు. అనంతరం తప్పుడు పాస్ పోర్టును సంపాదించిన గంగిరెడ్డి దేశం నుంచి బయటపడ్డాడన్నారు. దుబాయ్, మలేషియా, సింగపూర్ దేశాలకూ ఈ తప్పుడు పాస్ పోర్ట్ తో వెళ్లాడన్నారు. ఆ పాస్ పోర్ట్ ను పోలీసులు రద్దు చేయించారన్నారు. అయితే, విమానాశ్రయాల్లో తప్పుడు చిరునామాలు ఇచ్చి అధికారులను తప్పుదోవ పట్టించాడు. అనంతర పరిణామాల నేపథ్యంలో మారిషస్ లో గంగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News