: రైల్లో బాంబులు స్వాధీనం!
సాధారణ రైల్వే బోగీలో ఉంచిన బాంబులను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈశాన్య రైల్వేకు చెందిన కతిహా-మల్లా ఎక్స్ ప్రెస్ లోని జనరల్ బోగీలో ఒక సీటు కింద కార్టన్ బాక్స్ లో బాంబులు ఉన్నాయి. నిందితులు ఆ బాంబులను మరో చోటుకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వాటిని నిర్వీర్యం చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాంబుల తరలింపునకు సంబంధించి ఆరా తీస్తున్నామని, ఈ సంఘటనలో ఎవరెవరికి సంబంధముందనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.