: టర్కీ సంఘటనలో నలుగురు పోలీసులకు గాయాలు


‘టర్కీ’ సంఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. టర్కీలోని స్థానిక గాజియన్ టెవ్ ప్రాంతంలోని ఒక భవనంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి ఒంటికి బాంబులు తగిలించుకుని పేల్చేసుకున్నాడు. కాగా, జి-20 దేశాల సదస్సులో ఉగ్రవాదంపై పోరే ప్రధాన అజెండాగా సమావేశం జరుగుతోంది. అక్కడికి సమీపంలోనే ఈ సంఘటన జరగడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పారిస్ దాడుల దారుణం మరువకముందే టర్కీలో ఈ సంఘటన చోటుచేసుకోవడంపై పలు దేశాలు అప్రమత్తమయ్యాయి.

  • Loading...

More Telugu News