: హైదరాబాద్ చేరుకున్న గంగిరెడ్డి... మీడియా కళ్లుగప్పిన పోలీసుల హైడ్రామా!


మోస్ట్ వాంటెడ్ రెడ్ శాండల్ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. విమానం దిగిన తరువాత, దాదాపు అరగంట పాటు ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అధికారులు హైడ్రామా మధ్య, మీడియా కంట బడకుండా లక్డీకాపూల్ లోని సీఐడీ కార్యాలయానికి ఆయనను తరలించారు. ఈ విషయంలో మీడియా కళ్లుగప్పేందుకు పోలీసులు కొత్త మార్గాలను అన్వేషించారు. ఆయన్ను ప్రధాన ఎలైటింగ్ పాయింట్ లేదా వీఐపీలు రాకపోకలు సాగించే మార్గాల ద్వారా బయటకు తేవచ్చని భావించిన మీడియా పెద్దఎత్తున చేరుకోగా, రన్ వే చివర ఉన్న సరకు రవాణా కేంద్రం నుంచి ఆయన్ను బయటకు తెచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భారీ బందోబస్తు మధ్య ఆయన్ను తరలిస్తున్న వాహన శ్రేణి శంషాబాద్ గ్రామం దాటగా, మీడియా వాహనాలు కాన్వాయ్ ని చేజింగ్ చేస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News