: షూటింగ్ లో అమీర్ ఖాన్ కు గాయాలు
ప్రస్తుతం 'దంగల్' చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు షూటింగ్ లో గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ లూథియానాలో జరుగుతుండగా, రెజ్లింగ్ దృశ్యాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన గాయపడినట్టు సమాచారం. ఈ ఘటనతో షూటింగ్ వాయిదా పడగా, అమీర్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. రెజ్లింగ్ ప్రాక్టీసులో భాగంగా ఆయనకు స్వల్ప గాయమైందని సినిమా యూనిట్ సభ్యుడొకరు వివరించారు. ఈ చిత్రాన్ని మహావీర్ సింగ్ పోఘట్ అనే రెజ్లర్ జీవిత చరిత్ర ఆధారంగా నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు.