: నాగుల చవితి భక్తులపై తేనెటీగల దాడి... పలువురికి గాయాలు


పవిత్ర పర్వదినం నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలుపోసి నాగరాజును వేడుకుందామని వచ్చిన మహిళలకు చుక్కలు కనిపించాయి. కొందరు కాల్చిన టపాసులు పక్కనే చెట్టుపై ఉన్న తేనెటీగల తుట్టెను కదల్చగా, ఒక్కసారిగా విరుచుకుపడ్డ తేనెటీగల నుంచి తప్పించుకునేందుకు భక్తులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ ఘటన నేటి ఉదయం ఖమ్మం జిల్లా బయ్యారం సమీపంలోని గందంపల్లిలో జరిగింది. తేనెటీగల దాడిలో ఓ వృద్ధుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పలువురు మహిళా భక్తులను తేనెటీగలు కుట్టాయి.

  • Loading...

More Telugu News