: మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: పోప్ ప్రాన్సిస్


పారిస్ పై జరిగిన ఉగ్రదాడితో మూడవ ప్రపంచ యుద్ధం మొదలైందని పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్యానించారు. ఉగ్రదాడి తనను కదిలించి వేసిందని, అమాయకుల ప్రాణాలను హరించే హక్కు ఏ వ్యక్తికీ లేదని ఆయన అన్నారు. వాటికన్ నుంచి ఇటాలియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ అధికారిక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ద్వేషాన్ని ఉగ్రవాదులు ఒంటినిండా నింపుకున్నారని, మనుషులే ఇటువంటి పనులు చేయడాన్ని తన మనసు తట్టుకోలేకుండా ఉందని అన్నారు. ఈ నరమేధాన్ని ఖండించేందుకు సైతం తాను మాటలు వెతుక్కోవాల్సి వస్తోందని వాపోయారు. మూడవ ప్రపంచ యుద్ధంలో భాగంగా జరిగిన ఉగ్రదాడి తరువాత, అన్ని దేశాలూ మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News