: మూడవ మ్యాచ్ లోనూ సచిన్ జట్టు ఓటమి


ఆల్ స్టార్ సిరీస్ లో భాగంగా లాస్ ఏంజిల్స్ లో జరిగిన మూడవ మ్యాచ్ లో భారీ స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచినప్పటికీ, సచిన్ సేనను విజయం వరించలేదు. కలిస్, పాటింగ్ ల అద్భుత భాగస్వామ్యం వార్న్ వారియర్స్ ను విజయ తీరాలకు చేర్చింది. 220 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వార్న్ వారియర్స్ ఆఖరి ఓవర్లో ఎనిమిది పరుగులు చేయాల్సి ఉండగా, మరో బంతి మిగిలుండగానే వార్న్ సిక్స్ కొట్టి తన టీంను గెలిపించాడు. వార్న్ జట్టులో వాగన్ డక్కౌట్ కాగా, హెడెన్ 12, సైమండ్స్ 31, జాంటీ రోడ్స్ 17, సంగక్కార 42, కలిస్ 49, పాంటింగ్ 43, వార్న్ 6 పరుగులు చేశారు. సచిన్ బ్లాస్టర్స్ టీములో స్వాన్ 2, ఆంబ్రోస్, హూపర్, సెహ్వాగ్ లు చెరో వికెట్ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టులో సచిన్, గంగూలీలు హాఫ్ సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News