: వయసు పైబడి, చేవ చచ్చిన స్థితిలో కొల్లం గంగిరెడ్డి!
కొల్లం గంగిరెడ్డి... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మోస్ట్ వాంటెడ్ రెడ్ శాండల్ స్మగ్లర్. చంద్రబాబునాయుడిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు. గంగిరెడ్డి మారిషస్ లో అరెస్టయ్యాడన్న నాటి నుంచి ఆయన గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం తీసిన ఆయన వీడియోలు, చిత్రాలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు గంగిరెడ్డి ఎలా ఉన్నాడో తెలుసా? జుట్టంతా తెల్లబడిపోయి, వయసు పైబడి, రోగాలతో బాధపడుతున్న వాడిలా కనిపిస్తున్నాడు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఆయన్ను తీసుకువస్తున్న విమానంలో ఓ తెలుగు టీవీ చానల్ బృందం కూడా ఉంది. వారు తొలిసారిగా గంగిరెడ్డి తాజా వీడియోను తీసి ప్రసారం చేస్తున్నారు. ఈ వీడియోలో నెక్ బెల్ట్ ధరించి, ముసలివాడిగా గంగిరెడ్డి కనిపిస్తున్నాడు. మరికాసేపట్లో గంగిరెడ్డి ప్రయాణిస్తున్న విమానం హైదరాబాద్ కు చేరనుంది. ఆపై పూర్తి భద్రత, బులెట్ ప్రూఫ్ వాహనంలో ఆయన్ను పోలీసు కార్యాలయానికి తరలించనున్నారని సమాచారం.