: రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం... కలసి పోటీ చేద్దామని కాంగ్రెస్ ను కోరిన బీజేపీ!


డిసెంబర్ 9న త్రిపురలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్ పార్టీని బీజేపీ కోరడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. జాతీయ స్థాయిలో బద్ధశత్రువులైన ఈ రెండు పార్టీలూ త్రిపుర రాజధాని అగర్తలా మునిసిపల్ కార్పొరేషన్ లో విపక్షంలోనే ఉన్నాయి. రెండు పార్టీలూ కలిస్తే అక్కడ అధికారంలో ఉన్న వామపక్షాలను ఎదుర్కోవడం సాధ్యమవుతుందని, అందువల్లే ఈ ప్రతిపాదన చేశామని త్రిపుర బీజేపీ యూనిట్ ప్రెసిడెంట్ సుధీంద్ర దాస్ గుప్తా మీడియాకు తెలిపారు. తమతో కలసి నడవాలని, లేకుంటే ఎన్నకల్లో అభ్యర్థులను బరిలోకి దించరాదని తాము కోరుతున్నట్టు ఆయన తెలిపారు. గత సంవత్సరంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత త్రిపురలో బీజేపీ బలం మెల్లగా పెరుగుతోంది. ఇప్పటివరకూ జరిగిన పంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లో స్థానిక ఎన్నికల్లో బీజేపీ బలం పెరిగినట్టు స్పష్టంగా తెలుస్తోందని వెల్లడించిన ఆయన, ఓట్లు చీలకుండా చూడాలన్నది తమ అభిప్రాయమని తెలిపారు.

  • Loading...

More Telugu News