: 25 బంతుల్లో సచిన్ హాఫ్ సెంచరీ కొట్టిన వేళ...


ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీలో భాగంగా లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న టీ-20 పోటీల్లో సచిన్ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 25 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో సచిన్ 50 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో మహేల జయవర్థనే 15 బంతుల్లోనే 39 పరుగులు సాధించి ఊపుమీదున్నాడు. ఇదే క్రమంలో మరో సిక్స్ కొట్టిన సచిన్ 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెట్టోరీ బౌలింగ్ లో స్టంపింగ్ రూపంలో అవుట్ అయి పెవీలియన్ దారి పట్టాడు. దీంతో సచిన్ విన్యాసాలు చూస్తూ, ఆనందంతో గంతులేస్తున్న స్టేడియంలోని క్రీడాభిమానులు నిరాశ చెందారు. ప్రస్తుతం సచిన్ సేన స్కోరు 9.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు.

  • Loading...

More Telugu News