: చిన్నారి అతిథులకు చుక్కలు చూపిన ఏడు నక్షత్రాల హోటల్!


వారంతా చిన్నారులు. హైదరాబాద్ లో జరుగుతున్న చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి అతిథులుగా ప్రభుత్వ ఆహ్వానంపై వచ్చిన వారు. వారికి నక్లెస్ రోడ్డులోని సెవన్ స్టార్ హోటల్ 'పార్క్' చుక్కలు చూపించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఫెస్టివల్ నిర్వాహకులు చిన్నారుల బస కోసం పార్క్ హోటల్ ను ఎంపిక చేశారు. పదుల సంఖ్యలో పిల్లలు, వారి సంరక్షకులు హోటల్ గదుల్లో చెకిన్ అయ్యారు. ఆపై ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి వారి బ్యాగులు, సామానులు బయట పడేసి వున్నాయి. నిర్వాహకుల కోరిక మేరకు వారికి వేరే రూములిచ్చామని హోటల్ స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల నుంచి దాదాపు 2 గంటల వరకూ చలిలో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులంతా ఆరు బయట వేచి చూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి. వారిని కనీసం హోటల్ లాబీల్లో ఉండేందుకు సైతం అనుమతించలేదని తెలుస్తోంది. కొందరు విద్యార్థులు తమ బ్యాగులు, విలువైన వస్తువులు పోయాయని ఫిర్యాదు చేశారు. దాదాపు నాలుగు గంటల అనంతరం వారిని బేగంపేటలోని మరో హోటలుకు అధికారులు తరలించారు.

  • Loading...

More Telugu News