: కేంద్ర మంత్రిపై హరీశ్ రావు చిందులు!


పత్తి రైతులకు ఇస్తున్న మద్దతు ధరను పెంచుతామని ఆశ పెట్టి, ఆపై వారిని మోసం చేసింది బీజేపీయేనని తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. పత్తి కొనుగోలు విషయంలో తెలంగాణలో రైతులను సీసీఐ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రలో పత్తి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ విషయంలో బాధ్యతంతా కేంద్ర ప్రభుత్వానిదేనని, రాష్ట్రాల ప్రభుత్వాలకు సీసీఐతో సంబంధమేంటని ప్రశ్నించారు. తాము కేంద్ర మంత్రుల వద్ద మొర పెట్టుకున్నా స్పందించడం లేదని ఆయన వాపోయారు.

  • Loading...

More Telugu News