: మార్కెట్ కు వెళ్లాలన్నా భయపడతారు... ఆయుధాలున్నాయి, టార్గెట్లు ఫిక్సయ్యాయి: ఐఎస్ఐఎస్ వీడియో


ఫ్రాన్స్ పాటిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా, ప్రతీకారం తీర్చుకునేందుకే దాడులను చేసినట్టు చెబుతున్న ఐఎస్ఐఎస్ వీడియో ఒకటి విడుదలైంది. తమపై బాంబు దాడులు జరుపుతున్నంత కాలం, ఆయా దేశాలకు చెందిన ప్రజలు మార్కెట్ కు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి వస్తుందని, ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేరని ఈ వీడియోలో అబూ మర్యామ్ అనే ఉగ్రవాది హెచ్చరికలు చేశాడు. తమ వద్ద ఆయుధాలు ఉన్నాయని, వాటిని తీసుకువెళ్లే కార్లున్నాయని, టార్గెట్లు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నట్టు వీడియోలో ఉంది. తమ వద్ద విషం కూడా ఉందని, అల్లా శత్రువుల్లో ఒక్కరి ఆహారాన్నైనా విషపూరితం చేయాలని, వారికి నిద్ర లేకుండా చూడాలని పక్కనున్న ఉగ్రవాదులకు అబూ మర్యామ్ నూరిపోస్తున్న వీడియో విడుదలైంది.

  • Loading...

More Telugu News