: విశ్వ హిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ పరిస్థితి విషమం


గత కొంత కాలంగా గుర్గావ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) నేత అశోక్ సింఘాల్ పరిస్థితి మరింతగా విషమించింది. నెల రోజుల క్రితం నవరాత్రి పూజల సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ పట్టణానికి సింఘాల్ వెళ్లగా, పూజలు జరుగుతున్న సమయంలో తనకు ఊపిరాడటం లేదని, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పి కూలబడిపోయిన సంగతి తెలిసిందే. వెంటనే ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించగా, అప్పటి నుంచి ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. కాగా, ఆయన శ్వాస తీసుకోలేకపోతున్నారని వైద్యులు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆసుపత్రికి వచ్చి సింఘాల్ ను పరామర్శించి, ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు.

  • Loading...

More Telugu News