: చేతిలో గన్స్ తో లండన్ లో పట్టుబడ్డ ఫ్రాన్స్ ఉగ్రవాది!
ఫ్రాన్స్ లో జరిగిన మారణకాండలో భాగస్తుడు కావొచ్చని అనుమానిస్తున్న ఆ దేశీయుడిని లండన్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. అతని వద్ద రెండు గన్ లు ఉన్నాయని, ఫ్రాన్స్ పేలుళ్ల నేపథ్యంలో ప్రకటించిన దేశవ్యాప్త రెడ్ అలర్ట్ లో భాగంగా తనిఖీలు ముమ్మరం చేయగా ఇతను పట్టుబడ్డాడని అధికారులు తెలిపారు. ఇతని కోసం విమానాశ్రయం మొత్తాన్ని ఖాళీ చేయించాల్సి వచ్చిందని వివరించారు. ఇతను ఫ్రాన్స్ జాతీయుడని మాత్రమే వెల్లడించిన అధికారులు, మరే ఇతర సమాచారాన్ని తెలిపేందుకు నిరాకరించారు. ఇతన్ని విచారిస్తున్నామని తెలిపారు.