: గాట్విక్ ఎయిర్ పోర్టులో బాంబు కలకలం


బ్రిటన్ లోని గ్వాటిక్ ఎయిర్ పోర్టులో బాంబు కలకలం రేగింది. ఫ్రాన్స్ లో ఉగ్రదాడులతో అన్ని విమానాశ్రయాల్లోను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో బ్రిటన్ లోని గ్వాటిక్ ఎయిర్ పోర్టులో ఓ టెర్మినల్ వద్ద అనుమానాస్పదంగా ఓ బ్యాగు కనిపించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను, ప్రజలను ఖాళీ చేయించారు. ప్రత్యేక పోలీసు బలగాలు, బాంబ్ స్క్వాడ్, దర్యాప్తు బృందాలు సంఘటనా స్థలికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ బ్యాగులో బాంబు దొరకలేదు కానీ, తుపాకీ ఒకటి లభ్యమవ్వడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్రాన్స్ దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ ముమ్మర తనిఖీలు సాగుతున్నాయి. భారత్ లో కూడా భద్రత పటిష్ఠం చేశారు.

  • Loading...

More Telugu News