: పారిస్ లో ఆ 'నల్లకారు' కోసం వేట
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో నల్ల కారు కోసం వేట మొదలైంది. ఆ కారుకు, నిన్న జరిగిన ఉగ్రదాడికి సంబంధం ఉందని ఫ్రాన్స్ పోలీసులు భావిస్తున్నారు. జీయూటీ 18053 నెంబర్ ప్లేట్ ఉన్న ఆ విదేశీ కారును ఉగ్రవాదులు దాడి కోసం వినియోగించారని పారిస్ పోలీసులు భావిస్తున్నారు. దీని కోసం దేశంలోని అన్ని సరిహద్దులు మూసేసి మరీ జల్లెడపట్టారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఫ్రాన్స్ లో జరిగిన అతి పెద్ద కుట్ర ఇదేనని చరిత్రకారులు పేర్కొంటున్నారు.