: ఫ్రాన్స్ పోలీసులు మళ్లీ భయపడ్డారు


ఫ్రాన్స్ లో చీమ చిటుక్కుమన్నా పోలీసులు అప్రమత్తమవుతున్నారు. పారిస్ లో 1500 మంది అదనపు జవాన్లను మోహరించిన పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇంతలో పారిస్ సబర్బన్ ప్రాంతంలో పేలుళ్ల శబ్దం వినిపించింది. అంతే, సెకెన్ల వ్యవధిలో అక్కడ పోలీసులు వాలిపోయారు. ఆ పరిసరాల్లో పోలీసులంతా అప్రమత్తమయ్యారు. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధమై జల్లెడపట్టారు. అయితే అక్కడ జరిగింది బాంబు పేలుళ్లు కాదు. బాణాసంచా కాల్పులని తెలుసుకుని వెనుదిరిగారు. అక్కడ ఓ వివాహం సందర్భంగా జరిగిన పేలుళ్లని నిర్ధారించుకుని నిష్క్రమించారు. దీనిపై మీడియాతో మాట్లాడుతూ, ముందు గాభరాపడ్డామని, తర్వాత అవి వివాహం సందర్భంగా జరిగిన బాణసంచా కాల్పులని తెలుసుకుని నిట్టూర్చామని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News