: హాలీవుడ్ ను కుదిపేస్తున్న వార్త...అంతా వణికిపోతున్నారు


హాలీవుడ్ ను ఓ వార్త కుదిపేస్తోంది. ఆ వార్త ఏంటంటే... ఓ స్టార్ హీరోకి రెండేళ్ల క్రితమే హెచ్ఐవీ సోకింది. ఈ విషయం ఆయనతో లైంగిక సంబంధం కలిగిఉన్న ఓ పోర్న్ స్టార్ తెలిపింది. ఆమె తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే, తన పేరు వెల్లడిస్తే, ఆ హాలీవుడ్ నటుడు ఎవరు? అనే విషయం తెలిసి పోతుందని, తద్వారా అతనితో లైంగిక సంబంధం కలిగిన వారు అతనిపై కోర్టులో కేసులు వేసే అవకాశం ఉందని ఆమె పేర్కొంది. అయితే తనకు హెచ్ఐవీ ఉందని తనకు తానుగా ఆయన ఒప్పుకోవాలని, అది ఆయన సామాజిక బాధ్యత అని స్పష్టం చేసింది. ఆయనతో ఓ 50 మంది హాలీవుడ్ తారలకు లైంగిక సంబంధం ఉందని ఆ పోర్న్ స్టార్ వెల్లడించింది. అతనితో లైంగిక సంబంధాలు కలిగిన వారిలో ఓ ఐదుగురు పోర్న్ స్టార్లు, ఓ ప్రముఖ అవార్డు విన్నింగ్ నటి, ప్రముఖ టీవీ షో ప్రెజెంటర్, ఓ ప్రముఖ మీడియా జర్నలిస్ట్ కూడా ఉన్నారని ఆమె బాంబు పేల్చింది. అతనితో తాను సేఫ్ సెక్స్ చేశానని, ఓ సారి ఆ విధానం విఫలమవడం వల్ల తాను గర్భం ధరించానని, అయితే తప్పనిసరై అబార్షన్ చేయించుకున్నానని ఆమె చెప్పింది. అతనికి హెచ్ఐవీ ఉందని తెలియడంతో తాను పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకున్నానని, అదృష్టవశాత్తూ తనకు సోకలేదని ఆమె చెప్పింది. అతనితో సన్నిహిత సంబంధాలు కలిగిన ఓ నటుడితో ఈ నెల చివర్లో ఓ పోర్న్ సినిమాలో నటించాల్సి ఉందని, హెచ్ఐవీ సోకిన నటుడు బైసెక్సువల్ కావడంతో తనకు భయం పట్టుకుందని, ఆ సహనటుడికి కూడా ఉందేమోనన్న అనుమానం పీడిస్తోందని ఆమె పేర్కొంది. ఆ స్టార్ తో సంబంధం కలిగిన ఐదుగురు పోర్న్ స్టార్లు హెచ్ఐవీ సోకడంతో ఈ రంగం వదిలేసి వెళ్లిపోయారని ఆమె తెలిపింది.

  • Loading...

More Telugu News