: ఐసిస్ కు ఫ్రాన్స్ టార్గెట్ ఎందుకైంది?


ఇరాక్, సిరియాలలో తిష్టవేసుకుని ఉన్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకు ఫ్రాన్స్ ఎందుకు లక్ష్యమైంది? ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రాన్స్ లోని చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై విరుచుకుపడి 12 మంది పాత్రికేయులను మట్టుబెట్టిన ఐసిస్ కు ఫ్రాన్స్ పై ఎందుకంత కోపం? అసలు ఐసిస్ కు ఫ్రాన్స్ లక్ష్యంగా ఎందుకు మారింది? అంటే...1789 విప్లవంతో ప్రపంచానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పంచిన ఫ్రాన్స్ పై తాజా దాడులకు గతంలో జరిగిన కొన్ని సంఘటనలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆఫ్రికా, ఐరోపా ఖండానికి మధ్యధరా సముద్రమే అడ్డు. ఉత్తర ఆఫ్రికాలోని కొన్ని దేశాలు సుదీర్ఘ కాలం ఫ్రాన్స్ ఏలుబడిలో ఉండేవి. ఆఫ్రికా దేశాలను ఏలిన కొన్ని మధ్యప్రాశ్చదేశాలు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ప్రసాదిస్తూ, ఆ దేశాల నుంచి పూర్తిగా వైదొలిగాయి. ఫ్రాన్స్ మాత్రం గతంలో ఏలిన దేశాలతో సత్సంబంధాలు కలిగిఉంది. ఐరోపా నుంచి ఐసిస్ లో చేరేందుకు వెళ్లిన వారిలో సింహభాగం ఫ్రాన్స్ కు చెందిన వారే. ఛాందసవాదం ఏ రూపంలో ఉన్నా ఫ్రాన్స్ వ్యతిరేకిస్తుంది. అందుకే ప్రపంచ ఫ్యాషన్ నగరంగా పారిస్ రూపుదిద్దుకుంది. ఇది కొన్ని మతాలు, వర్గాల ప్రజలకు కంటగింపుగా మారింది. ఈ కంటగింపు విద్వేషంగా మారింది. సంప్రదాయం పేరిట దాగున్న ఛాందసవాదంపై చార్లీ హెబ్డో పత్రిక వ్యంగ్య రచనలు చేసింది. ఇది ముస్లిం వర్గానికి ఆగ్రహం కలిగించింది. దీంతో ఆ పత్రిక కార్యాలయంపై దాడి జరిగింది. ఇరాక్, సిరియాల్లో తీవ్రవాదులుగా శిక్షణ పొందిన వారు స్వదేశం చేరుకుని, స్లీపర్ సెల్స్ గా ఉన్నారు. తాజాగా సిరియా, ఇరాక్ ప్రజలు ఐరోపా దేశాలకు వలసలు మొదలు పెట్టారు. శరణార్థులుగా ఆ దేశాలకు చేరుకున్న వారిలో ఒకరిగా ఐసిస్ ఉగ్రవాదులు కూడా ఫ్రాన్స్ చేరుకున్నారు. కేవలం ఫ్రాన్స్ మాత్రమే కాకుండా ఐరోపా అంతటా వారు విస్తరించినట్టు సమాచారం. వీరంతా యాక్టివ్ అయ్యారు. ఇదే క్రమంలో ఉత్తర ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాద చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ దేశం గతంలో ఫ్రాన్స్ అధీనంలో ఉండడంతో అక్కడ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ మొదలు పెట్టింది ఫ్రాన్స్. అలాగే ఇరాక్, సిరియా దేశాల్లో అమెరికా జరుపుతున్న ఉగ్రదాడులకు ఫ్రాన్స్ సాయం చేస్తోంది. ఈ కారణాల నేపథ్యంలో ఫ్రాన్స్ పై ఉగ్రవాదులు దాడులు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News