: సఫారీలు చతికిలపడ్డ చోట నిలబడ్డ ధావన్, విజయ్


సఫారీలు చతికిలపడ్డ చోట టీమిండియా ఓపెనర్లు మురళీ విజయ్ (28), శిఖర్ ధావన్ (45) నిలదొక్కుకున్నారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించింది. దీంతో, సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. డివిలియర్స్ (85), ఎల్గర్ (38), మోర్కెల్ (22) రాణించడంతో మూడు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 59 ఓవర్లు ఆడి 214 పరుగులు చేసింది. ప్రోటీస్ పతనంలో అశ్విన్, జడేజా పాలుపంచుకున్నారు. అనంతరం, బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు తొలిరోజు ఆటముగిసే సమయానికి 22 ఓవర్లు ఆడి వికెట్లేమీ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ఓపెనర్లు మురళీ విజయ్, ధావన్ ఆచి తూచి ఆడారు. తొలత జాగ్రత్తగా ఆడిన ధావన్, తరువాత స్వేచ్చగా బ్యాటు ఝళిపించాడు. దీంతో టీమిండియా 134 పరుగులు వెనుకబడింది. నిలదొక్కుకుని, భారీ స్కోరు సాధించాలని, తద్వారా ఇన్నింగ్స్ విజయం సాధించాలని భారత్ ఆశపడుతోంది.

  • Loading...

More Telugu News